గబ్బర్ సింగ్ అన్నని ఎలా చూపిస్తాడో..?
ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హరీష్ శంక ఇప్పుడు అన్నయ్యతో ఎలాంటి సినిమా తీస్తారో అని ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. తప్పకుండా ఈ కాంబో సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాగానే వెంటనే హరీష్ శంకర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హరీష్ శంకర్ కూడా చిరుతో సినిమా కోసం సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. హరీష్ శంకర్ రవితేజ కాంబో సినిమా మిస్టర్ బచ్చన్ సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా తారక్ దేవర సినిమాకు పోటీగా వస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమా లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. రవితేజ కూడా మిస్టర్ బచ్చన్ సినిమాతో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇంతకీ హరీష్ శంకర్ చిరుతో ఎలాంటి సినిమా చేస్తాడు. కొంపదీసి మళ్లీ ఏదైనా రీమేక్ ఆలోచనలో ఉన్నారా ఏంటని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఐతే భోళా శంకర్ ఇచ్చిన షాక్ తో చిరు ఇక మీదట రీమేక్ ల జోలికి వెళ్లకూడదని అనుకున్నాడని తెలిసిందే. మరి మెగా డైరెక్టర్ తో రాబోతున్న ఈ మెగా మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.