కంప్యూటర్ బాగు చేసే వ్యక్తికి అవకాశం ఇచ్చిన కృష్ణవంశీ.. ఇప్పుడు చూస్తే స్టార్.. అతడు ఎవరంటే..?

MADDIBOINA AJAY KUMAR
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం కొంత మంది కాళ్లు అరిగేలా తిరుగుతూ ఉంటారు. అలా తిరిగే వారిలో కొంత మంది కి అవకాశాలు వస్తాయి. మరి కొంత మంది కి అవకాశాలు రాకుండానే కెరియర్ కూడా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక మరి కొంత మంది కి మాత్రం అనుకోకుండానే సినిమా అవకాశాలు వస్తాయి. వారు ఇండస్ట్రీ లో గొప్ప స్థాయికి ఎదుగుతూ ఉంటారు. అలాంటి వారిలో సుబ్బరాజు ఒకరు. ఇకపోతే ఈయనకు సినిమా అవకాశం ఎలా వచ్చిందో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. మరి సుబ్బరాజు కు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఒకానొక సమయంలో కృష్ణక్వంశీ గారికి సంబంధించిన పర్సనల్ లాప్టాప్ లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట. దానితో ఎవరైనా లాప్టాప్ బాగు చేసి వారు ఉంటే పిలిపించండి అని తన మేనేజర్ కు చెప్పాడట. దానితో మేనేజర్ ఒక వ్యక్తిని పిలిపించి లాప్టాప్ ను బాగు చేయిస్తున్నాడంట. అంతలో అక్కడికి వచ్చిన కృష్ణ వంశీ అతనిని చూశాడట.

ఇతను ఎవరు ... మంచి హైట్ ... పర్సనాలిటీతో హీరోలా ఉన్నాడు అని కృష్ణ వంశీ అనుకున్నాడట. ఇక ఆ తర్వాత అతనితో మాట్లాడగా అతనికి కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం అని తెలిసిందట. ఇక దానితో వెంటనే తాను తెరకెక్కిస్తున్న ఖడ్గం సినిమాలో ఓ టెర్రరిస్ట్ పాత్రను అతనికి ఇచ్చాడట. ఇక ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , అందులోని సుబ్బరాజు పాత్రకు కూడా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత నుండి ఈయనకు సినిమాలలో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇక ప్రస్తుతం కూడా సుబ్బరాజు తెలుగు లో మంచి గుర్తింపు కాలా నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: