త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర సినిమా తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇతర భాషల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేయడంతో ఇప్పుడు ఆయనపై పెద్ద బాధ్యత ఉంది అని చెప్పాలి. అయితే దేవర సినిమా విడుదల కి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహిస్తే బాగుంటుంది అని
కోరుకుంటున్నారు అభిమానులు. పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ సైతం ఫ్యాన్ ఇండియా లెవెల్ లోనే జరగాలి అని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏ దారిలో చేస్తే దేవర పై అంచనాలు రెట్టింపు అవుతాయో అదేవిధంగా ప్రమోషన్స్ నిర్వహిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. అయితే దేవర ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో షార్ట్ అండ్ స్వీట్ గా చేస్తే కచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో డైరెక్టర్ గా ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్
ఇదే అని అంటున్నారు. మరోవైపు ఆచార్య వల్ల కొరటాల శివ ప్రమోషన్స్ విషయంలో ఎలా వ్యవహరిస్తారో క్లారిటీ లేదు. అందువల్ల తారక్ ఇప్పటినుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. దేవర టీజర్ ను వీలైనంత వేగంగా రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. ఈ ఏడాది దసరా సెలవులను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోవాలని ఎన్టీఆర్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. జాన్వీ కపూర్ దేవరతో సక్సెస్ సాధిస్తే కొన్నేళ్ల పాటు వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉండే అవకాశం ఉంది. దేవర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 207 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది..!!