వామ్మో: ఇదేం విచిత్రం రా బాబు.. తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువ..?
తెలుగులో టై ర్ -2 ఈరోజు రేంజ్ లో బిజినెస్ జరిగిందని చెప్పవచ్చు అలాంటి బిజినెస్ కి టికెట్ హైక్స్ కూడా పెంచుతారని ఎవరు అనుకోలేదు. కానీ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ బజ్ అంతగా లేకుండా ఇండియన్-2 చిత్రానికి తెలుగులో భారి టికెట్స్ హైక్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది.. సింగిల్ స్క్రీన్ లో 225 ఉండగా మల్టీప్లెక్స్ లలో 300 రేట్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రాలో అయితే 200 రూపాయల వరకు ఉన్నది.. కానీ ఇక్కడ గమనించేదగ్గ విషయం ఏమిటంటే తమిళనాడులో ఇండియన్-2 సినిమా మేజర్ ఏరియాలో 195 రూపాయలే ఉన్నదట ఇలా చెన్నై వంటి ప్రాంతాలలో కూడా ఇలాగే ఉన్నది.
ఈ లెక్కన చూసుకుంటే ఇండియన్-2 సినిమాకి తెలుగులోనే అత్యధిక ధర ఉండదని చెప్పవచ్చు. అయితే తెలుగులో అత్యధిక రేట్లు ఉండడంతో కమలహాసన్ తెలుగు ప్రేక్షకులకు ఏం అన్యాయం చేశారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. భారతీయుడు-2 ముఖ్యంగా తమిళంలో రేట్లు తక్కువ ఉండి తెలుగులో రేట్లు ఎక్కువగా ఉండటం చేత ఇది దోపిడీ కాదా అంటూ పలువురు నేటిజెన్సీ సైతం ప్రశ్నిస్తున్నారు.. ముఖ్యంగా తమిళంలోనే అంత తక్కువ రేట్లో ఉన్నప్పుడు తెలుగులో ఇంత టికెట్లు రేటు పెంచడం ఏంటా అంటూ కూడా చాలామంది పెదవి విరుస్తున్నారు..