పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ తాజాగా నటించిన
కల్కి 2898 ఎడి
సినిమా గురించి అందరికీ తెలిసిందే. టాలెంటెడ్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులంతా
ఫిదా అవుతున్నారు. ఇందులో
బాలీవుడ్ స్టార్
హీరోయిన్ దీపిక పదుకొనె
హీరోయిన్ గా నటించగా దిశా పటాని,అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన,
మాళవిక నాయర్,
విజయ్ దేవరకొండ,
దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ నటి నటులు ఈ సినిమాలో పలు కీలకమైన పాత్రలలో నటించారు. తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా
హిందీ, తమిళ్, మలయాళం వంటి భాషలలో తెరకెక్కిన ఈ
సినిమా భారీ విజయాన్ని
అందుకుంటుంది. ఇదిలా ఉండగా సౌత్ లో కంటే ఈ
సినిమా నార్త్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే హిందీలో ఈ
సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా నార్త్
ఇండియా హిందీ వర్షన్ లో మంగళవారం రోజున ఈ
సినిమా 5.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. వీక్ డేస్ లో కూడా ఈ
మూవీ ఇంతటి భారీ కలెక్షన్ ను సాధించడం గొప్ప విషయమని చెప్పవచ్చు. అంతే కాకుండా ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఇప్పటివరకు నార్త్ లో ఈ
సినిమా 224.40 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏడాది లో అత్యంత భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా
కల్కి 2989 ఎడి నిలిచింది.
రానున్న రోజుల్లో ఈ
సినిమా ఇంకెంత సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి. కాగా
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ సినిమాని
అశ్వినీ దత్ నిర్మాణం వహించారు.
ఈ చిత్రం మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. 'కల్కి 2898 AD' తెలుగు వెర్షన్ విడుదలైన మొదటి వారంలో 202.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇదిలా ఉంటే, హిందీ వెర్షన్ రూ. 152.5 కోట్లు రాబట్టి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో హిందీ చిత్రంగా నిలిచింది.