మరో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్.. వామ్మో అన్ని కోట్లా..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాతో మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మరో పది రోజుల్లో పూర్తి కాబోతోంది. నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల తో సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే సినిమాల విషయం కాస్త పక్కన పెడితే..

మెగా ఫ్యామిలీకి ఆస్తులు ఎంత ఉన్నాయో చాలామందికి తెలిసి ఉంటుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి కార్లు అంటే చాలా పిచ్చి. చిరంజీవి దగ్గర రోల్స్ రాయిస్ తో పాటు మరో ఖరీదైన నాలుగు కార్లు సైతం ఉన్నాయి. రామ్ చరణ్ కి కూడా దాదాపుగా 6 కంటే ఎక్కువ ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా వాటిలో మరో కారు కూడా జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా రామ్ చరణ్ బ్లాక్ కలర్ రోల్స్ రాయిస్ కొత్త వర్షన్ స్పెక్ట్రా కొనుక్కున్నాడు. దాదాపు 7.5 కోట్లతో చరణ్ ఈ కారుని కొన్నాడు. జనవరిలో ఈ కార్ విడుదలవ్వగా చరణ్ అప్పుడే బుక్ చేసాడు. ఆ కార్ ఇటీవలే చరణ్ చేతికి వచ్చింది. హైదరాబాద్ లో ఈ కార్ కొన్న మొదటి

 వ్యక్తి చరణ్ కావడం గమనార్హం. రామ్ చరణ్ దాదాపు 7.5 కోట్లు ఖర్చుపెట్టి కొత్త కారు కొనడంతో మరోసారి చరణ్ కార్లు చర్చగా మారాయి. చరణ్ కి ఇప్పుడు కొన్న రోల్స్ రాయిస్ కారుతో పాటు ఇంకో అరడజను కార్లు ఉన్నాయి. 4 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ GLS 600 కారు, కోటి రూపాయల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ GLE400 కూప్ కారు, 3.2 కోట్ల విలువ చేసే ఆస్టన్ మార్టిన్ వన్టేజ్ కారు, 3.5 కోట్ల విలువ చేసే ఫెరారీ పోర్టోఫినో కారు, 2.75 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారు, 1.75 కోట్లు విలువ చేసే bmw 7 సిరీస్ కారు ఉన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: