రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , శోభన , మృణాల్ ఠాకూర్ ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే వి ఈ మూవీ లో చిన్న చిన్న క్యామియో పాత్రలలో కనిపించారు. ఈ మూవీ జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది.
ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు కూడా వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ వచ్చింది. కాకపోతే ఒక విషయంలో మాత్రం కల్కి సినిమా ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల అయిన హనుమాన్ సినిమా రికార్డుకు దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ఆ రికార్డు ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఎక్కువ రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా 20 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను ప్రీమియర్స్ తో కలిసి రాబడితే , కల్కి సినిమా మాత్రం కేవలం 13 రోజులు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టింది. ఈ విధంగా చూసినట్లు అయితే హనుమాన్ సినిమా రికార్డుకు దరిదాపుల్లో కూడా కల్కి సినిమా రాలేకపోయింది.