తెలుగులో మంచి క్రేజ్ కలిగిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ 7 బుల్లి తెర , ఒక ఓ టి టి సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. మొదటి బిగ్ బాస్ తెలుగు బుల్లి తెర షో కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా , ఆ తర్వాత రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడవ సీజన్ నుండి ఇప్పటి వరకు తెలుగు లో జరిగిన అన్ని సీజన్ లకి కూడా నాగర్జున హోస్ట్ గా వ్యవహరించాడు.
కొన్ని రోజుల క్రితమే బిగ్ బాస్ 7 వ సీజన్ విజయవంతంగా కంప్లీట్ అయింది. ఆరవ సీజన్ కి పెద్దగా టి ఆర్ పి రేటింగ్ రాబడకపోవడంతో 7 వ సీజన్ లో ఉల్టా పుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్ ను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సీజన్ కి మళ్ళీ మంచి టి ఆర్ పి రేటింగ్ దక్కింది. ఏడవ సీజన్ లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే 8 వ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది. దానితో ప్రస్తుతం బిగ్ బాస్ బృందం కంటెస్టెంట్ లను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఇకపోతే ఎనిమిదవ సీజన్ ను రసవత్తంగా మార్చేందుకు మంచి టాలెంట్ ఉన్న వారిని బిగ్ బాస్ బృందం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి వార్తల్లో నిలిచిన బర్రెలక్కను తీసుకురావాలి అని , అలాగే జబర్దస్త్ నటుడు అయినటువంటి కిరాక్ ఆర్ పి కూడా ఈ మధ్య కాలంలో అనేక పొలిటికల్ విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయనను కూడా షో లోకి తీసుకురావాలి అని బిగ్ బాస్ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మరి కొంత మంది క్రేజీ కంటెస్టెంట్ లను కూడా తీసుకువచ్చి షో ను రసవత్తరంగా మార్చాలి అని బిగ్ బాస్ బృందం చూస్తున్నట్లు తెలుస్తోంది.