తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఆ ఒకరు అయినటువంటి ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ప్రభాస్ కి చాలా మొహ మాటం , సిగ్గు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎక్కువ మొహ మాటం ఉండడం వల్ల ప్రభాస్ తన సినిమాలకు సంబంధించిన ఈవెంట్ లకే చాలా కష్టంగా వస్తూ ఉంటాడు. వచ్చినా కానీ ఫ్యాన్స్ కోసం ఒకటి , రెండు మాటలు తప్పిస్తే పెద్దగా ఏమీ మాట్లాడడు. అలాగే ఇతరుల ఫంక్షన్ లకి కూడా ప్రభాస్ చాలా తక్కువగా వస్తూ ఉంటాడు. దీనంతటికీ కారణం ప్రభాస్ కు ఉన్న మొహమాటమే అని చాలా మంది చాలా సందర్భాలలో చెపుతూ వచ్చారు.
ఇకపోతే ఈ మొహ మాటం వల్ల ప్రభాస్ ఒక దర్శకుడి చేత గట్టిగానే తిట్లు కూడా తిన్నాడట. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు. అసలు ప్రభాస్ ఏ సందర్భంలో ఏ దర్శకుడితో తిట్లుతున్నాడు అనే విషయం తెలుసుకుందాం. ప్రభాస్ కొంత కాలం క్రితం మిస్టర్ పర్ పేక్ట్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో గ్రేట్ డైరెక్టర్ విశ్వనాథ్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ప్రభాస్ , విశ్వనాధ్ కాంబినేషన్ లో కొన్ని సీన్లు వచ్చినప్పుడు ప్రభాస్ గట్టిగా డైలాగ్ లు చెప్పలేకపోతున్నాడట. దానితో డైరెక్టర్ ప్రభాస్ ను సైలెంట్ గా డైలాగ్ లు చెప్పిన దానిని మేనేజ్ చేస్తున్నారట.
ఇక షాట్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత విశ్వనాథ్ గారు ప్రభాస్ నీ పక్కకు పిలిచి ఇంత పెద్ద హీరోవి , నీకు ఎంతో స్టార్ డమ్ ఉంది. నువ్వు ఇలా డైలాగ్ లను గట్టిగా చెప్పకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. నువ్వు డైలాగులు గట్టిగా చెప్పడం ప్రాక్టీస్ చెయ్ నీ వల్ల అవుతుంది అని చెప్పాడట. ఇకపోతే ప్రభాస్ ఇదే విషయం గురించి చెబుతూ ... చత్రపతి సినిమాలో కూడా నేను చాలా మంది తో ఉన్న సన్నివేశాలలో గట్టిగా డైలాగులు చెప్పలేదు. దానితో రాజమౌళి నువ్వు మెల్లిగా చెప్పు నేను డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పాడు. అదే అలవాటు అయ్యింది అని ప్రభాస్ తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు.