నా సినిమా ఫ్లాప్ అయితే.. సెలబ్రేట్ చేసుకుంటున్నారు : స్టార్ హీరో

praveen
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఇండియాలోనే అతిపెద్ద ఇండస్ట్రీగా కొనసాగేది. ఎందుకంటే అక్కడ ఏ సినిమా విడుదలైనా కూడా వందల కోట్ల కలెక్షన్స్ సాధించేది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదైనా సినిమా 100 ఓట్ల కలెక్షన్స్ సాధించింది అంటే అదే గొప్ప అనుకునే పరిస్థితి ఉన్న సమయంలో ఇక బాలీవుడ్ మూవీస్ మాత్రం 100 కాదు ఏకంగా వేల కోట్ల వసూళ్లు చేసేవి అని చెప్పాలి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమరు అయింది. ఒకవైపు సౌత్ ఇండస్ట్రీలో నుంచి ఎన్నో సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. వేల కోట్ల వసూళ్లు సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొడుతున్నాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోలు సరైన హిట్ లేక ఇబ్బంది పడిపోతున్నారు.

 ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన.. అక్కడి ప్రేక్షకులు మాత్రం స్టార్ హీరోలకు ఒక్క హిట్ ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోతుంది అని చెప్పాలి. కాగా ఇలా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చివరికి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో నిరాశ పడిపోతున్న హీరోలలో అటు బాలీవుడ్ కిలాడిగా పేరు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీలని షేక్ చేసిన ఈ స్టార్ హీరో ఇక ఇప్పుడు హిట్ అందుకోక చాలా రోజులే అవుతుంది.

 ఇక ఇటీవలే మరో కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆ మూవీ కూడా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పాలి. తన సినిమాలు ఫ్లాప్ అవడం గురించి ఇటీవల అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాలు ఫ్లాప్ అయితే కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటూ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు. గత సినిమాలు బడే మియాన్ చోటే మియాన్, రామ్ సేతు, రక్షాబంధన్,  బచ్చన్ పాండే, సెల్ఫీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా వరుస ప్లాపుల నుంచి ఎలాఎదుర్కొని కోలుకోవాలనే విషయాన్ని అమితాబచ్చన్ నుంచి నేను నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అక్షయ్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: