ప్రశాంత్ వర్మ ఆలోచనలలో మోక్షజ్ఞ !

Seetha Sailaja
ఎప్పటి నుండో నందమూరి బాలకృష్ణ అభిమానులు అతడి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాని మోక్షజ్ఞ ఫిలిమ్ ఎంట్రీ పై క్లారిటీ రావడంలేదు. దీనికితోడు మోక్షజ్ఞ లుక్ నిన్నమోన్నటివరకు బాగా లావుగా ఉండటంతో బాలయ్య వారసుడు ఎంట్రీ ఇక లేనట్లే అని అనుకున్నారు అంతా.



అయితే ఎవరు ఊహించని విధంగా మోక్షజ్ఞ తన లుక్ ను మార్చుకుని స్లిమ్ గా తయారువ్వడమే కాకుండా తన సినిమా ఎంట్రీకి రెడీ అవుతున్నాడు అని లేటెస్ట్ గా వచ్చిన వార్తలతో బాలయ్య అభిమానులు జోష్ లోకి వెళ్లిపోతున్నారు. మోక్షజ్ఞ ఫిలిమ్ ఎంట్రీ అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుంది అని వార్తలు వచ్చాయి. అయితే అనీల్ వెంకటేష్ తో సినిమాకు కమిట్ అవ్వడంతో మోక్షజ్ఞ తో అతడి సినిమా ఉండదు అన్నక్లారిటీ వచ్చేసింది.



ఇలాంటి పరిస్థితుల మధ్య ఈసంవత్సరం సంక్రాంతికి ఎవరు ఊహించని విధంగా ‘హనుమాన్’ మూవీతో బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ చెప్పిన ఒక కథకు బాలయ్య ఓకె చేయడంతో ఆకథకు హీరో మోక్షజ్ఞ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ఒక సినిమా చేయాలని చాలగట్టి ప్రయత్నాలు చేశాడు అని అంటారు. అయితే రణబీర్ కపూర్ ‘రామాయణం’ మూవీకి కమిట్ అవ్వడంతో మరో రెండు సంవత్సరాల వరకు మరో ప్రాజెక్ట్ ఏదీ ఒప్పుకునే ఉద్దేశ్యంలో లేడు అన్నవార్తలు వస్తున్నాయి.



దీనితో ప్రశాంత్ వర్మ తన బాలీవుడ్ ఆలోచనలు పక్కకు పెట్టి బాలయ్య మోక్షజ్ఞ సినిమా కోసం వచ్చిన ఆఫర్ ను ఓకె చేశాడు అని అంటున్నారు. ‘హనుమాన్’ మూవీతో ఒకనాటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ్ సజ్జాను ప్రశాంత్ వర్మ క్రేజీ హీరోగా మార్చాడు. ఇప్పటివరకు సినిమాల పై పెద్దగా ఆశక్తి కనపరచని మోక్షజ్ఞ ను హీరోగా ఒప్పించడమే కాకుండా నందమూరి అభిమానుల అంచనాలకు అనుగుణంగా మోక్షజ్ఞ సినిమాను తీర్చి దిద్దడం ఒకవిధంగా ప్రశాంత్ వర్మకు ఒక సాహసం అనుకోవాలి..  




 .  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: