హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ తాజాగా సర్ఫేరా అనే సినిమాలో హీరోగా నటించాడు ఇకపోతే. ఈ మూవీ తమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన సురరై పోట్రు అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా తెలుగు లో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ సినిమా తమిళ్ , తెలుగు భాషలలో ఒకే సారి థియేటర్ లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి తమిళ్ , తెలుగు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి సుధా కొంగర దర్శకత్వం వహించింది.
ఇది ఇలా ఉంటే సుధా కొంగర ఈ మూవీ ని అక్షయ్ కుమార్ హీరో గా సర్ఫరా అనే టైటిల్ తో హిందీలో రీమిక్ చేసింది. దాదాపు ఈ సినిమాను 80 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ పబ్లిసిటీకి 20 కోట్ల మేర ఖర్చు అయినట్లు దానితో మొత్తం ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని నిన్న అనగా జూలై 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ఈ సినిమాను ఇండియాలో 2500 స్క్రీన్ లలో , వరల్డ్ వైడ్ గా 3200 స్క్రీన్ లలో విడుదల చేశారు.
ఇకపోతే ఈ మధ్య కాలంలో వరుస అపజాయలతో కెరియర్ ను కొనసాగిస్తున్న అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. కాకపోతే మొదటి రోజు కలెక్షన్లు మాత్రం పెద్ద స్థాయిలో కలెక్షన్లు దక్కే అవకాశం లేనట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా 1.75 కోట్ల కనెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు , ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంచి టాక్ వచ్చినా కూడా ఈ సినిమాకు మొదటి రోజు చాలా తక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు టేడ్ వర్గాలు ప్రస్తుతం అంచనా వేస్తున్నాయి.