పొలిమేర రేంజర్ స్టెప్ బై స్టెప్ పెంచుతున్న దర్శకుడు.. ఏకంగా ఈసారి అలాంటి ప్రయోగం..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితం అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో మా ఊరి పొలిమేర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సత్యం రాజేష్ , గెటప్ శీను , బాలాదిత్య ప్రధాన పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి భాగం పెద్దగా అంచనాలు లేకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ మొదటి భాగంకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు రావడం మొదలు అయింది. ఇక ఈ సినిమా మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ఓ టి టి లో కాకుండా థియేటర్ లలో విడుదల చేశారు.

ఇక థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఈ మూవీ కి భారీ మొత్తంలో లాభాలు కూడా వచ్చాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే మా ఊరి పొలిమేర 3 సినిమా కూడా మరి కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయడానికి ఈ మూవీ బృందం వారు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే మొదట చిన్న సినిమాగా ఓ టీ టీ లో విడుదల అయిన మా ఊరి పొలిమేర ఆ తర్వాత థియేటర్ లలో విడుదల అయింది. ఇక ఇప్పుడు ఏకంగా ఈ సినిమాను  పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ యొక్క రేంజ్ ను స్టెప్ బై స్టెప్ మేకర్స్ పెంచుతూ వెళ్లడానికి మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: