కల్కి 1000 కోట్లు.. అమితాబ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
అయితే 1000 కోట్లు మార్క్ దాటినందుకు మిగతా కాస్ట్ అంతా ఎలా ఫీల్ అవుతున్నారో ఏమో కానీ లెజెండ్రీరీ నటుడు అమితాబ్ బచ్చన్ మాత్రం ఫుల్ ఖుషి గా ఉన్నారని అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కల్కి 1000 కోట్లు పోస్ట్ లకి తన రిప్లైలు, రిపోస్టులే కనిపిస్తున్నాయి. షారుక్ " పఠాన్" ని కల్కి కేవలం 15 రోజుల్లో క్రాస్ చేసింది అంటే అమేజింగ్ అని మరో పోస్ట్ కి ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాలో భాగం అయ్యినందుకు ఎంతో గర్వపడుతున్నాను అంటూ అమితాబ్ బచ్చన్ రిప్లై పోస్ట్ లు చేశారు.
మొత్తానికి కల్కి సక్సెస్ నీ మాత్రం అందరి కంటే అమితాబ్ నే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, విజయ్ దేవరకొండ, ప్రభాస్, మృణిల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న సంగతి కూడా తెలుసు.కల్కి మూవీలో ప్రభాస్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో పక్క దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కూడా అదరగొట్టేసారు అని అంటున్నారు. కల్కి మూవీ విజయాన్ని అమితాబ్ బచ్చన్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.