తెలుగులో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో మారుతి ఒకరు. మారుతి "ఈ రోజుల్లో" అనే సినిమాతో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి ఇప్పటి వరకు అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే మారుతి ఆఖరుగా గోపీచంద్ హీరో గా రాసి కన్నా హీరోయిన్ గా రూపొందిన పక్కా కమర్షియల్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా మారుతి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా మహానుభావుడు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మారుతీ మాట్లాడుతూ ... మహానుభావుడు సినిమాకు సంబంధించిన స్టోరీని చాలా సంవత్సరాల క్రితమే రాసుకున్నాను. హీరో క్యారెక్టర్ అతి శుభ్రంగా ఉంటుంది. ఇక ఆ అతి శుభ్రత వల్ల అతనికి ఎన్నో సమస్యలు వస్తాయి. ఇక అలా సమస్యలు వస్తున్నా సమయంలో ఒక వైరస్ కూడా వస్తుంది. ఆ వైరస్ వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే కథతో సినిమాను చేద్దాం అనుకున్నాను.
కాకపోతే ఈ వైరస్ ఇదంతా ఎవరికి అర్థం అవుతుంది అనుకున్నాను. ఇక హీరోగా శర్వానంద్ ను అనుకున్న తర్వాత శర్వానంద్ కు మాస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈమేజ్ ను పెంచడం కోసం ఆ వైరస్ బ్యాక్ డ్రాప్ కు బదులు పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో స్టోరీని డెవలప్ చేశాను అని మారుతి తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే మారుతీ దర్శకత్వంలో రూపొందిన మహానుభావుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో మెహరీన్ హీరోయిన్ గా నటించింది.