కొన్ని సంవత్సరాల క్రితం దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ హీరోగా భారతీయుడు అనే సినిమాను తేరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా ఆ టైమ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు శంకర్ కి కమల్ హాసన్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో రెహమాన్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాకు రెహమాన్ అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంశాలను అందుకున్నాడు.
ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 మూవీ అనౌన్స్ అయింది. భారతీయుడు మూవీకి రెహమాన్ సంగీతం అందించడంతో ఆ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీ కి రెహమాన్ సంగీతం అందిస్తాడు అని అంతా అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా అనిరుద్ రవిచంద్రన్ ను ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. అనిరుద్ కూడా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఈయన కూడా సూపర్ మ్యూజిక్ ను ఈ మూవీ కి అందిస్తాడు అని జనాలు అంతా అనుకున్నారు. ఇక నిన్న ఈ సినిమా విడుదల అయింది. ఈ మూవీలో అనిరుద్ మార్క్ మ్యూజిక్ ఎక్కడా కనబడలేదు. దానితో శంకర్ మిస్టేక్ చేశాడు. ఈ మూవీ కి రెహమాన్ ని సంగీత దర్శకుడుగా తీసుకుంటే బాగుండేది.
ఆయన భారతీయుడు సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ అద్భుతం. దానితో పోలిస్తే అనిరుద్ ఈ సినిమాకు ఏ మాత్రం దగ్గరికి రాలేకపోయాడు అని నెగటివ్ కామెంట్స్ ఈయనపై వస్తున్నాయి. ఇక మరి కొంత మంది మాత్రం సినిమాలో ఆయన సంగీతం ఇవ్వడానికి సరైన సన్నివేశాలు లేనప్పుడు అతను మాత్రం ఏం చేస్తాడు. దర్శకుడు కథ విషయంలో పొరపాటు చేశాడు అని మరి కొంత మంది వాదిస్తున్నారు ఏదేమైనా ఈ సినిమాకు మాత్రం నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ కి భారీ మొత్తంలో కలక్షన్లు రావడం కూడా చాలా కష్టంగా కనబడుతుంది.