ఏ దర్శకుడు అయినా ఒక హీరోతో సినిమా తీసిన సమయంలో ఆ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఆ తర్వాత అదే హీరోతో మరి సినిమా అవకాశం వచ్చిన ఆ హీరోతో సినిమా చాలా కాన్ఫిడెన్స్ గా సినిమా చేస్తూ ఉంటారు. అదే కనుక ఒక హీరోతో సినిమా తీసి అది కానీ ఫ్లాప్ అయినట్లు అయితే మరోసారి ఆ హీరోతో సినిమా తీసే అవకాశం వచ్చినా కూడా అనేక అనుమానాల వల్ల అనేక విషయలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి పరిస్థితులనే డైరెక్టర్ బి గోపాల్ ఎదుర్కొన్నాడట. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
బి గోపాల్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెకానిక్ అల్లుడు అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు కూడా కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత చాలా కాలానికి బి గోపాల్ కి మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది. ఆ మూవీ ని అశ్వినీ దత్ నిర్మించడానికి రెడీ అయ్యాడు. ఇకపోతే చిరంజీవితో సినిమా చేయడానికి బి గోపాల్ , చిన్ని కృష్ణ దగ్గర ఉన్న ఒక కథను తీసుకున్నాడు. కాకపోతే ఆ కథ మొత్తం విన్న ఆయనకు ఆ సినిమా చిరు పై వర్కౌట్ కాదు అనిపించి దానిని పక్కన పెట్టేసాడట.
ఇక దానితో కథ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఎందుకు నీకు ఈ కథ నచ్చలేదు అని అడిగాడట. దానికి ఆయన ఇప్పటికే నేను బాలకృష్ణతో సమరసింహారెడ్డి , నరసింహా నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలను రూపొందించాను. మళ్ళీ అలాంటి తరహా కథతో చిరంజీవితో సినిమా చేస్తే అది వర్కౌట్ కాదనిపిస్తుంది. ఇప్పటికే మెకానిక్ అల్లుడు సినిమాతో చిరంజీవికి ఒక ఫ్లాప్ ఇచ్చాను. మళ్లీ మరొక ఫ్లాప్ ఇవ్వాలి అనుకోవట్లేదు అని అన్నాడట. దానితో గోపాలకృష్ణ , బాలకృష్ణ వేరే హీరో , చిరంజీవి వేరే హీరో. ఒక హీరో పై ఒకే రకమైన కథలను తెరకెక్కిస్తే జనాలకు బోర్ కొడుతుంది. కానీ హీరో మారాడు అంటే మళ్ళీ వారు ఫ్రెష్ గా ఫీల్ అవుతారు అని అన్నాడట. దానితో కాన్విన్స్ అయిన బి గోపాల్ , చిన్ని కృష్ణ కథతో చిరంజీవి హీరోగా అశ్విని దత్ నిర్మాణంలో ఇంద్ర మూవీ ని రూపొందించడానికి డిసైడ్ అయ్యాడట.