విశ్వనటుడు కమల్ హాసన్ నటించినా లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయినా సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో భారతీయుడు 2 నుంచి ఫస్ట్ సింగిల్ పేరు సాంగ్ రిలీజ్ అయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . శౌర అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ కమల్ గుర్రం స్వారీ చేస్తూ కనిపించారు.ఈ క్రమంలో చూపించిన విజువల్స్ మూవీపై బజ్ క్రేయేట్ చేస్తున్నాయి. శౌరా... అగనిత సేనా సమా అంటూ పవర్ఫుల్గా సాగుతున్న ఈ లిరికల్ సాంగ్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలిచింది.ఒకప్పుడు హిట్ అయినా భారతీయుడు సినిమాకు సీక్వెల్ కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను భారతీయుడు 2 అందుకోలేకపోయింది. ఈ సినిమాకి మ్యూజిక్కే పెద్ద మైనస్. సినిమా ముందే మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా ఒక సాంగ్ లో మధ్యలో వచ్చే ఒక్క బిట్ మాత్రం బాగా వైరల్ అయింది.భారతీయుడు 2 నుంచి సినిమా రిలీజ్ కి ముందు విడుదల చేసిన శౌరా.. సాంగ్ లో మధ్యలో ‘నీ పాద ధూళి మెరుపవుతను నీ యుద్ధ కేళి మరకవుతను.. గుడియా గుడియా నీతో గడిపే గడియా..’ అంటూ మెలోడీగా ప్రేమని వ్యక్తపరిచే లిరిక్స్ వస్తాయి. ఈ సాంగ్ లో ఈ బిట్ అందరికి బాగా నచ్చేసింది. రీల్స్ లో అయితే ఈ పాట బాగా వైరల్ అయింది. బ్రిటిష్ కాలంలో యుద్ధ సమయంలో ఈ పాట వస్తుందని లిరిక్ సాంగ్ చూస్తే అర్ధమవుతుంది.
దీంతో కొంతమంది ఈ పాట కోసమే సినిమాకు వెళ్లగా సినిమాలో ఈ పాట లేకపోవడం గమనార్హం.భారతీయుడు 2 సినిమాలో రెండే పాటలు ఉన్నాయి. ఈ శౌరా సాంగ్ సినిమాలో లేకపోవడంతో ఈ పాట అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ పాట కోసమే సినిమాకు వెళ్తే ఈ పాట లేదని పోస్టులు చేస్తున్నారు. అయితే సినిమా చివర్లో చూపించిన భారతీయుడు 3 ట్రైలర్ చూస్తే అందులో బ్రిటిష్ వాళ్ళతో యుద్దాలు ఉన్నాయి, ఈ శౌరా సాంగ్ కూడా బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాల సమయంలో ఉన్నట్టే చూపించారు కాబట్టి ఈ పాట భారతీయుడు 3లో ఉండొచ్చు అని తెలుస్తుంది. ఒకవేళ పార్ట్ 3లో ఉంటే ఈ పాట ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారో మరి.ఇక వీటితో పాటు శంకర్ సినిమాల్లో పాటలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో అంత వినడానికి, చూడటానికి బాగుంటాయి. దీనికి ఏఆర్ రహమాన్ కూడా ఒక కారణం. శంకర్ సినిమాల్లో స్నేహితుడు, అపరిచితుడు, ఇప్పుడు వచ్చిన ఇండియన్ 2 తప్ప అన్ని సినిమాలకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకుడు. ఏఆర్ రహమాన్ లో కూడా ఒకప్పటి మ్యాజిక్ మిస్ అవ్వడం, ఇప్పుడు శంకర్ సినిమాల్లో పాటలు పెద్దగా హిట్ అవ్వకపోవడం కూడా శంకర్ కి మైనస్ అవుతుంది. భారతీయుడు 2 సినిమాకి మ్యూజిక్ చాలా పెద్ద మైనస్. ఏఆర్ రహమాన్ ని పక్కనపెట్టి అనిరుద్ తో కొట్టించాడు. సినిమాల్లో మ్యూజిక్, పాటలు మైనస్ అవ్వడం కూడా సినిమాల ఫెయిల్యూర్ కి ఒకరకంగా కారణమే అని అందరికి తెలుసు.