గురూజీ దయ అంటూ పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్..!

Divya
తెలుగు సినీ ప్రేక్షకులకు అలనాటి హీరోయిన్లలో పూనమ్ కౌర్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. ఈమె సినిమాలలో కంటే నిరంతరం వివాదాలలోని నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ పేరు వినిపించగానే ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పూనమ్ కౌర్ పొలిటికల్ పరంగా కూడా యాక్టివ్ గా ఉన్న అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూ ఉంటుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా నటించింది. నిరంతరం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీలకు స్థానం కల్పించేలా చేస్తూ ఉంటుంది.

ఇటీవల కాలంలో త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తూ ఉన్నది. గురూజీ అంటూ డైరెక్ట్ గా కౌంటర్లు వేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పూనమ్ కౌర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఇలా పోస్ట్ చేస్తూ.. ఆ పోస్టులో ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది.. ఎవరి గురించి అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. కానీ ఎవరో భార్యగా వస్తారు కట్టుకున్న దాన్ని పిల్లలతో సహా రోడ్డుమీదికి గెంటేస్తారు.. భర్త ఎలాంటి పనులు చేసినా కూడా ఆ భార్యలు అంగీకరిస్తూ ఉంటారు అంటూ.. అలాగే కట్టుకున్నది మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది.. ఇదంతా గురూజీ దయ వల్ల వచ్చిన ఆ భార్య మాత్రం చాలా హాయిగా ఉంటుంది అంటూ ఇదంతా కేవలం గురూజీ స్క్రిప్ట్ అంటూ తెలిపింది.

అంతేకాకుండా భారత మహిళల బ్రెయిన్ ని చిన్నతనం నుంచి ఒక ట్యూన్ చేసి పెట్టారేమో భర్త సుఖమే నీ సుఖము అన్నట్లుగా తెలిపింది.. భర్త కోసం అన్ని త్యాగం చేయాలని మాటలు చెప్పి అలానే పెంచుతూ ఉంటారు ఆమె ఎంతో మంచిది నిజాయితీపరురాలు అయినా కూడా వారికి ఇచ్చే గుణం అంటూ తన పోస్టులు రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఇలా ప్రతిసారి గురూజీ అంటూ త్రివిక్రమ్ పేరు రాయడం కామన్ గా మారిపోయింది దీన్ని బట్టి చూస్తే ఇదంతా త్రివిక్రానీ ఉద్దేశించే రాసిందేమో అనంతగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: