అదృష్టం అంటే ఇదే.. భారీ డిజాస్టర్ నుంచి దిల్ రాజు లక్కీ ఎస్కేప్?

praveen
ప్రొడ్యూసర్ దిల్ రాజు మంచి విజన్ ఉన్న దర్శకుడు అని అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఏ సినిమా హిట్ అవుతుంది. ఏ సినిమా ఫట్ అవుతుంది అన్న విషయం ఆయన ముందుగానే గ్రహిస్తూ ఉంటారు  అందుకే సినిమాలను నిర్మించడం విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ మూవీ నుంచి ఎంతో తెలివిగా తప్పించుకుని దిల్ రాజు సేఫ్ అయిపోయాడు అంటూ ఒక వార్తా సోషల్ మీడియాలోవైరల్ గా మారిపోయింది.

 కొంతకాలం క్రితం దిల్ రాజు ఏ సినిమా తీసిన రిజల్ట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అనే విధంగా ఉండేది. కానీ కొన్ని రోజుల నుంచి ఆయనకు అస్సలు కలిసి రావడం లేదు. ఏ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేడా కొట్టేస్తుంది. అయితే ఇటీవల భారీ బడ్జెట్ మూవీ ని మొదలు పెట్టిన దిల్ రాజు చివరికి ఆ సినిమా తేడా కొడుతుందని.. ముందే గ్రహించి మధ్యలోనే తప్పుకుని సేఫ్ అయ్యాడు. ఇటీవల జూలై 12వ తేదీన విడుదలైన భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా వాస్తవానికి నిర్మించాల్సింది దిల్ రాజే. దిల్ రాజు బ్యానర్ లో శంకర్ కమలహాసన్ కలిసి ఈ సినిమా ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు.

 అయితే ఆ తర్వాత లైకా  ప్రొడక్షన్స్ తో ఒక సినిమా చేస్తానని గతంలో డైరెక్టర్ శంకర్ కమిట్ అయ్యారు. ఇక ఈ కమిట్మెంట్స్ కారణంగా భారతీయుడు 2 సినిమా నిర్మాణం నుంచి దిల్ రాజు తప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడెప్పుడో 2018లో మొదలైన భారతీయుడు 2 సినిమా అనేక కారణాలవల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటిరోజు బీభత్సమైన నెగిటివ్ టాక్ వచ్చిన తెలుగులో పది కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడులో మాత్రం భారతీయుడు 2 నెగటివ్ టాక్ వసూళ్లపై ప్రభావం చూపింది. దీంతో ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఒక రకంగా 200 కోట్లు పెట్టిన లైకా ప్రొడక్షన్స్ కి భారీ నష్టాలు మిగిల్చింది. దీంతో ముందే ఈ సినిమా నుంచి తప్పుకున్న దిల్ రాజు సేఫ్ అయ్యాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: