ఏకంగా అంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్న దిల్ రాజు.. చిక్కి ఉంటే ఇక అంతే..?

Pulgam Srinivas
తెలుగులో అత్యంత క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం నుండే మంచి విజయాలను అందుకుంటూ నిర్మాతగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభంలో కొత్త దర్శకులతో , కొత్త నటులతో సినిమాలను తెరకెక్కించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. దానితో కూడా ఈయన క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇకపోతే ప్రస్తుతం దిల్ రాజు పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ ని మొదలు పెట్టాడు.

ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది ఇలా ఉంటే దిల్ రాజు మొదట శంకర్ తో భారతీయుడు 2 మూవీ ని ప్రొడ్యూస్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఆల్మోస్ట్ దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందించడానికి రెడీ అయింది. ఇక చివరి నిమిషంలో ఈ సినిమా నిర్మాణంలోకి లైకా ప్రొడక్షన్ సంస్థ వచ్చింది. దానితో దిల్ రాజు ఈ మూవీ నుండి తప్పుకున్నాడు. చాలా సంవత్సరాల పాటు కొనసాగిన భారతీయుడు 2 యొక్క షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యింది. ఈ మూవీ జూలై 12 వ తేదీన విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు కూడా రావడం లేదు. ఇక చాలా మంది దిల్ రాజు భారతీయుడు 2 సినిమా కనుక నిర్మించి ఉంటే ఆయనకు ఈ సినిమా ద్వారా పెద్ద నష్టం జరిగి ఉండేది. ఆయన పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడు అని అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే దిల్ రాజు ,  శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ ని రూపొందించాడు. మరి ఆ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

dr

సంబంధిత వార్తలు: