ఇది కదా మహేష్ క్రేజ్ అంటే! అంబానీస్ నే షేక్ చేశాడు?

Purushottham Vinay

 అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ల పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న నటులతో పాటుగా గ్లోబల్ స్టార్స్ కూడా హాజరయ్యారు.ఎవరికి వారే పెళ్ళిలో ప్రత్యేకంగా నిలవాలని రెడీ అయ్యి వచ్చారు. కానీ అందరిని ఆకట్టుకుంది మాత్రం టాలీవుడ్ టాప్ హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు అనే చెప్పాలి. డార్క్ కలర్ డ్రెస్ లో మహారాజాలా అందరి దృష్టిని ఆకర్షించాడు. మహేష్ ని చూస్తే అచ్చం హాలీవుడ్ హీరోల ఉన్నాడు. మహేష్ ని చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు ట్రెండ్ అయినంత బాగా ఎవరూ ట్రెండ్ అవ్వలేదనే చెప్పాలి. ఇక ఈ పెళ్లిలో మహేష్ క్రేజ్ తో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాకి కూడా పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ వచ్చింది. ప్రపంచ బిలియనీర్ అంబానీ ఇంట వివాహానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్నిరంగాల అతిరథమహారథులు హాజరైయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు, హీరోయిన్లు, రాజకీయ ప్రముఖులతో పాటుగా పెద్ద పెద్ద బిజినెస్ దిగ్గజాలు కూడా వచ్చారు. 


వీరే కాకుండా.. పలువురు గ్లోబల్ స్టార్స్ ఈ పెళ్లి వేడుకలో తమ స్టైల్ లో సందడి చేశారు. అయితే ఈ పెళ్లికి ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా కానీ మన సూపర్ స్టార్ హీరోని మాత్రం డామినేట్ చేయలేకపోయారు. అనంత్-రాధిక పెళ్లికి ఫ్యామిలీతో పాటుగా హాజరైయ్యాడు సూపర్ స్టార్.అంబానీ ఇంట వివాహానికి డార్క్ కలర్ డ్రెస్ లో లాంగ్ హెయిర్ లో అచ్చం హాలీవుడ్ యాక్షన్ హీరోలా దర్శనమిచ్చాడు మహేశ్. దాంతో అందరి దృష్టి మనోడి పైనే పడింది.మహేష్ క్రేజ్ రాజమౌళి సినిమాకి సూపర్ హైప్ ఇవ్వడమే కాక.. పలు ప్రశ్నలకు కూడా సమాధానంగా నిలిచింది. మహేశ్ బాబు-జక్కన్న కాంబోలో అడ్వెంచర్ యాక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ మహేష్ రికార్డులు సృష్టించడం పక్కా.. ఈ సినిమాని 1000 కోట్ల బడ్జెట్ తో కనీ వినీ ఎరుగని రీతిలో సీనియర్ నిర్మాత KL నారాయణ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకి హాలీవుడ్ నిర్మాతలు కూడా భాగస్వామ్యం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: