యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈయన "టైసన్ నాయుడు" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా పూర్తి అవ్వకముందే తను చేయబోయే రెండో సినిమాని కూడా రీసెంట్ గా లాంచ్ చేసాడు ఈ యంగ్ హీరో. అయితే తను నటించబోయే రెండో సినిమా కౌశిక్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
ఈ రెండు సినిమాలతో పాటు తాజాగా ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్త దర్శకుడు అయిన సుధీర్ దర్శకత్వంలో ఈయన ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. కాగా ఈ సినిమా కథ చాలా కొత్తగ శ్రీనివాస్ నటించని పాత్రలో నటించనున్నారు. డేరింగ్ గెటప్ తో ప్రేక్షకులను అలరించేందుకు తెరమీదకి వస్తున్నారు. కాగా ఈయన ఆ సినిమాలో అఘోర అనే పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులకు సినిమాపై క్యూరియాసిటి ఏర్పడింది.
ఇదిలా ఉండగా ఈ యంగ్ హీరో కెరియర్ లోనే ఈ సినిమా కాస్ట్లీయోస్ట్ మూవీ గా రాబోతుందట. అంతే కాకుండా హైందవ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ని కూడా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్ . కాగా చందు మహేష్, సాయి శశాంక్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని ప్రారంభించేందుకు మేకర్స్ అంతా సిద్ధమవుతున్నారు. నిజంగానే ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ అఘోర పాత్రలో నటించి డెర్ చేయబోతున్నాడా అనేది చూడాలి మరి.అల్లుడు అదుర్స్ , ఛత్రపతి రీమేక్ సినిమాలతో బెల్లంకొండ శ్రీనివాస్ లకు భారీ షాకులు తగలడం గమనార్హం. బెల్లంకొండ శ్రీనివాస్ రాబోయే రోజుల్లో తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.