వాళ్ల పెళ్లికి అందుకే వెళ్లలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని తాప్సి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తేలకు పరిచయం అయింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకోవడం అలాగే ఇందులో ఈమె తన నటనతో అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగులో అవకాశాలు భారీగా పెరిగాయి. తెలుగులో పర్వాలేదు అనే స్థాయిలో కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే తాప్సీ హిందీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది.

అందులో భాగంగా ఈమెకు బాలీవుడ్లో మంచి అవకాశాలు దక్కాయి. అలాగే ఈమె నటించిన చాలా సినిమాలు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈమె ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా చెప్పుతూ ఉంటుంది. దానివల్ల అనేక సార్లు ఈమె వార్తల్లో నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈమె ఒక విషయం గురించి చాలా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... జూలై 12 వ తేదీన ముకాష్ అంబానీ తనయుడు అయినటువంటి అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్ తో చాలా గ్రాండ్ గా జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ పెళ్లి వేడుకకు అనేక మంది సెలబ్రిటీలు హాజరు అయ్యారు. కొంత మంది ఈ పెళ్లి వేడుకకు దూరంగా ఉన్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో తాప్సి ఒకరు. ఇకపోతే తాజాగా తాప్సి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమెకు అనంత్ అంబానీ పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఈమె స్పందిస్తూ ... తనకు అంబానీ కుటుంబంతో ఎలాంటి రిలేషన్ షిప్ లేదు. ఎవరి పెళ్లి కైనా అతిధులతో కమ్యూనికేషన్ ఉంటేనే వెళ్లేందుకు ఇష్టపడతాను. నాకు వ్యక్తిగతంగా వారితో ఎలాంటి పరిచయం లేదు. అందుకే ఆ పెళ్లికి వెళ్లలేదు అని తాప్సీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: