జూనియర్
ఎన్టీఆర్ కెరీర్ ను మార్చేసిన
సినిమా ‘ఆది’.. స్టూడెంట్ నెం1 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న
ఎన్టీఆర్ ఆ తరువాత చేసిన సుబ్బు నిరాశ పరిచింది. అదే సమయంలో దర్శకుడు వి.వి వినాయక్ తో
ఎన్టీఆర్ ఆది సినిమాను మొదలు పెట్టారు..ఆది సినిమా షూటింగ్ దశలో ఉండగానే ‘సింహాద్రి’సినిమా నిర్మాతలు అయిన వి.ఎం.సి(విజయ మారుతీ క్రియేషన్స్) వారు
ఎన్టీఆర్ తో ఓ
సినిమా చేయాలని భావించారు. అగ్రిమెంట్ కూడా పూర్తయ్యింది. ‘ఆది’ చిత్రీకరణ దశలో ఉండగానే ఆ
సినిమా షూటింగ్ కూడా మొదలైంది.ఓ ప్రముఖ దర్శకుడు ఆ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు.ఎన్టీఆర్ కి
కూడా కథ నచ్చడంతో ఆ
సినిమా మొదలుపెట్టారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే
లవ్ స్టోరీగా ఆ కథ సాగుతుంది.. అయితే ఆ
సినిమా సగం పైనే షూటింగ్ కంప్లీట్ అయ్యింది.అదే సమయంలో ‘ఆది’
సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్
అయిన ఆది సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..ఆ సినిమాతో
ఎన్టీఆర్ ఇమేజ్ కూడా మారిపోయింది.
ఆది సినిమాతో
ఎన్టీఆర్ మాస్ హీరో అయిపోయాడు. దీంతో దొరస్వామి రాజు,విజయ్
కుమార్ వర్మ ఆలోచనలో పడ్డారు. వారు
ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి నిర్మిస్తున్న సినిమాలో
మాస్ ఎలిమెంట్స్ ఏమి లేవు. ‘ఆది’ లో
ఎన్టీఆర్ కి ఉన్న ఎలివేషన్స్ తమ సినిమాలో లేకపోవడంతో వారు పునరాలోచనలో పడ్డారు.ఆ పాటికే
ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సగం ఫినిష్ చేసేశాడు.అయినా కూడా
ఎన్టీఆర్ ను ఒప్పించి వారు అదనంగా డేట్స్ తీసుకున్నారు.
ఎన్టీఆర్ కూడా అందుకు అంగీకరించాడు. అయితే వారు అప్పటివరకు చేసిన సినిమాని ఆపేశారు. ఆ డబ్బు పోయినా పర్వాలేదు
ఎన్టీఆర్ తో పక్కా
మాస్ సినిమా చేయాలనీ భావించారు. అందుకు తగ్గ కథ కోసం వెతుకుతున్నారు. ఇదే సమయంలో
రాజమౌళి తన
తండ్రి సిద్ధం చేసిన
సింహాద్రి కథతో బాలయ్యను డైరెక్ట్ చేయాలని ఆయనకు కథ చెప్పి ఒప్పించేందుకు సిద్ధం అయ్యారు.సింహాద్రి స్టోరీ నిర్మాతలకు నచ్చడంతో ఆ
సినిమా ఎన్టీఆర్ తో చేసేందుకు రాజమౌళిని ఒప్పించారు.దీనితో
ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను
రాజమౌళి అందించారు.