సెంటిమెంట్ పై ఆధారపడిన రామ్ చరణ్ !

Seetha Sailaja
‘ఉప్పెన’ మూవీ తరువాత దర్శకుడు బుచ్చిబాబు కు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ టాప్ హీరోలతో సినిమాలు చేయడమే ధ్యేయంగా పెట్టుకోవడంతో అతడు మరొక సినిమాను మొదలు పెట్టడానికి మూడు సంవత్సరాలకు పైగా పట్టింది. ఎట్టకేలకు బుచ్చిబాబు చెప్పిన కథను రామ్ చరణ్ ఓకె చేయడంతో త్వరలో ఈమూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది.

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోబోతున్న ఈమూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన కీలక నటీనటుల ఎంపిక జరిగింది. ఆ ఎంపికలో ఈమూవీలోని ఒక ముఖ్య పాత్రకు ఫిలిమ్ ఇండస్ట్రీలో అందరితోను శివన్న అని పిలిపించుకునే కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ ఈమూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

శివరాజ్ కుమార్ కు టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి మధ్య ఒక సెంటిమెంట్ ఉంది అతడు ఏదైనా ఒక భారీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తే ఆమూవీ సూపర్ హిట్ అయిన సందర్భాలు చాల ఉన్నాయి. ఆ సెంటిమెంట్ తో పాటు కన్నడ ఫిలిమ్ ప్రేక్షకులలో శివరాజ్ కుమార్ కు ఉన్న క్రేజ్ రీత్యా పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీలో శివన్న ను ఎంపిక చేశారు అని టాక్. దీనికితోడు చిరంజీవికీ శివరాజ్ కుమార్ కు ఎప్పటి నుంచో కొనసాగుతున్న స్నేహ బంధం రీత్యా ఈ ఎంపిక జరిగింది అన్న అంచనాలు కూడ ఉన్నాయి.

ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ అక్టోబర్ లో విడుదలకాబోతున్న నేపద్యంలో రామ్ చరణ్ బుచ్చిబాబుల మూవీ షూటింగ్ వేగంగా పూర్తిచేసి ఈమూవీని వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో విడుదల చేయాలాని ఈమూవీ నిర్మాతల ఆలోచన అని అంటున్నారు. ఈమూవీలో కూడ చరణ్ పోషించే పాత్ర కొంతవరకు రఫ్ గా ఉంటుందని టాక్. అదేవిధంగా జాన్వీ కపూర్ పాత్ర కూడ డీ గ్లామయర్ గా ఉంటుందట. శివన్న సెంటిమెంట్ రామ్ చరణ్ కు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: