సినిమాల రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా కానీ హీరోల రెమ్యునరేషన్లు మాత్రం ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. రీసెంట్గా బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కూడా రూ.35 కోట్లు తీసుకునే హీరో సినిమాలు మొదటి రోజు రూ.3.5 కోట్లు కూడా కలెక్ట్ చేయడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసి దూమారం రేపాడు.చాలా మంది హీరోలు హిట్లు రాగానే తమ రెమ్యునరేషన్‌ను పెంచేసి దాన్ని డబుల్ చేస్తారు. అదే ఒకటీ, రెండు ఫ్లాప్స్ వచ్చినా కానీ కొందరు హీరోలు మాత్రం రెమ్యునరేషన్‌ను అస్సలు తగ్గించుకోరు. ఇక ఒక హీరో అయితే వరుసగా 9 డిజాస్టర్లు ఫేస్ చేసి ప్లాపుల్లో రికార్డ్ క్రియేట్ చేశాడు. అయినా కానీ తన లాస్ట్ సినిమాకు మాత్రం ఏకంగా రూ.165 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా..? అతనే అక్షయ్ కుమార్. ఈ బాలీవుడ్ హీరోకు ఒకప్పుడు ఉండే క్రేజ్ అసలు అంతా ఇంతా కాదు. బాలీవుడ్ ని సాసించే ఖాన్ హీరోలకి ఇతనంటే వణుకు. ఒక దశలో వరుస హిట్లతో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి అగ్ర హీరోలని కూడా వణికించాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు అలా వరుస హిట్లతో మినిమం గ్యారెంటి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్.అసలు ఒకప్పుడు ఆయన సినిమా రిలీజవుతుందంటే ఫ్యాన్స్ ఓ రేంజ్లో రచ్చ చేసేవారు.
ఖాన్లు, కపూర్లు ఇండస్ట్రీని ఏలుతున్న టైమ్‌లో వాళ్లకు పోటీగా అక్షయ్ కుమార్ సినిమాలు చేసేవాడు. ఇంకా అంతేకాదు ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా అక్షయ్ కుమార్ నిలిచేవాడు.కానీ ఇప్పుడు మాత్రం ఒక్క హిట్టు కోసం ఆయన పడే పాట్లు అసలు అన్నీ ఇన్నీ కావు. అసలు అక్షయ్ కుమార్ సోలోగా, సాలిడ్ హిట్టు కొట్టి ఇప్పటికీ మూడేళ్లయింది. అయితే అక్షయ్ కుమార్ పతనం మాత్రం బచ్చన్ పాండే అనే సినిమాతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి ఆయన వరుస డిజాస్టర్లు ఫేస్ చేశాడు.ఇక మధ్యలో ఓమైగాడ్ సినిమా కాస్త బానే ఆడింది కానీ.. బిజినెస్ భారీగా జరగడంతో కమర్షియల్‌గా డిస్ట్రిబ్యూటర్లను సేఫ్‌లో నిలబెట్టలేకపోయింది ఈ సినిమా. పైగా ఈ సినిమా మొత్తంలో అక్షయ్ కుమార్ రఫ్‌గా కనిపించేది కేవలం 20 నిమిషాలు మాత్రమే.అయితే ఇప్పుడు సర్ఫిరా సినిమాకు మాత్రం కేవలం రూ.27 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. ఏది ఏమైనా ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో చెలరేగిపోయిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు వరుస ఫ్లాపులు మాత్రం ఆయనకి ఇంకా కాస్త నిరాశను కలిగిస్తున్నాయి. అక్షయ్ కుమార్ ఎలాగైనా ఓ పెద్ద హిట్టు కొట్టాలని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.