పాపం.. ఆ సీనియర్ హీరోలకు ఆ సినిమాల వల్ల అంత డ్యామేజ్ జరిగిందా..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సినిమాలు అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతూ ఉంటాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైమ్ లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న మన తెలుగు సీనియర్ స్టార్ హీరోల మూవీ లు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి ఈ మధ్య కాలంలో నటించిన కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య , భోళా శంకర్ సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి.
నందమూరి నట సింహం బాలకృష్ణ కెరియర్ లో కూడా కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ "రూలర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఫెయిల్యూర్ అయ్యింది.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొంత కాలం క్రితం ది ఘోస్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధిస్తుంది అని అక్కినేని అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
విక్టరీ వెంకటేష్ కొంత కాలం క్రితం సైంధవ్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: