తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే.. ఆయన పేరు అభిమానుల స్లోగన్ కాబట్టి. తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తెలుగు సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన ఘనత బాలయ్యకే దక్కుతుంది. 14 ఏళ్లకే తెరంగేట్రం చేసిన బాలయ్య.. నాలుగు దశబ్దాలకుపైగా ఇండస్ట్రీలో దుమ్ములేపుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ సినిమాలతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతున్నారు.కేవలం రెండు, మూడు వారాల్లోనే వంద కోట్ల కలెక్షన్లను సునాయసంగా కొట్టేస్తున్నాడు.అసలు ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో బాలయ్య సినిమాపై జరిగే బిజినెస్.. ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. దానికి తోడు బాలయ్య ప్రతీ సినిమాకు వేరేయేషన్ చూపిస్తూ కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీనిస్తున్నాడు.అఖండ నుండి కొత్త బాలయ్యను చూస్తున్నాం. ఆ తర్వాత వచ్చిన వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరీ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. వంద కోట్ల కలెక్షన్లు సాధించాయి. నిజానికి చాలా మంది టైర్2 హీరోలు వంద కోట్లు కొట్టడానికి పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. కానీ బాలయ్య మాత్రం అలా వచ్చి ఇలా వంద కోట్లు సింపుల్‌గా కొట్టేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే.. బాలయ్య అగ్రెషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా సార్లు బాలయ్య కోప్పడిన సందర్భాలు లైవ్‌లోనే మనం చూస్తుంటాం. అలాంటి బాలయ్యను ఓ స్టార్ హీరో పరిగెత్తించి మరీ కొట్టాడన్న విషయం మీకు తెలుసా..?ఆ హీరో మరోవరో కాదు.. బాలయ్య అన్న హరికృష్ణ. హరికృష్ణ అంటే బాలయ్యకు చెప్పలేనంత అభిమానం. తండ్రి తారక రామారావు తర్వాత ఆ స్థానంలో ఉండి హరికృష్ణ అన్నయ్య తనను చూసుకునే వాడని బాలయ్య చాలా సార్లు చెబుతుంటాడు. తారక రామారావు షూటింగ్‌లలో, రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు హరికృష్ణ అన్నయ్య మమ్మల్ని తండ్రి స్థానంలో ఉండి చూసుకునేవాడని బాలయ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా హరికృష్ణ అంటే ప్రేమ, అభిమానం, గౌరవంతో పాటు భయం కూడా బాగా ఉండేదని, ఒక్కోసారి తండ్రి ఎన్టీఆర్ కూడా హరికృష్ణ అన్నకు భయపడేవాడని బాలయ్య ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.
అసలు హరికృష్ణ అన్నయ్య నడిచి వస్తుంటే.. ఒక ఆరా వినిపించేదని చెప్పుకొచ్చాడు.అలాంటి హరికృష్ణ ఓ రోజు తన తాతతో కలిసి ఊర్లో పొలం వద్ద పనులు చేస్తుండగా బాలకృష్ణ ఆ పొలం వద్దకు వెళ్లి ఈ పొలాలన్నీ మావే, అంటూ తన ఫ్రెండ్స్ కు స్టైల్ గా చెప్పారట. దీంతో కోపం వచ్చినటువంటి హరికృష్ణ కట్టే పట్టుకొని బాలకృష్ణను ఇంటి దాకా తీసుకెళ్లారట.నా పొలం అంటావా కష్టపడి పని చేయడం తెలియదు కానీ స్టైల్ గా వచ్చి ఇది నా పొలం అంటూ మాట్లాడతావా కోతకోశావా, నారు వేశావా, పంట పండించావా.? ఇది నీది అని ఎలా చెబుతున్నావ్ అంటూ బాలకృష్ణని కొట్టాడట.వాళ్ల తాత సైతం హరికృష్ణకే వత్తాసు పలికాడట. మొదట్నుంచి ఆ కష్టం తెలిసిన మనిషి, మొరటు మనిషి అని బాలయ్య కథానాయకుడు సినిమా ఇంటర్వూ టైమ్‌లో ఇలా తన అన్నయ్య గురించి చెప్పుకొచ్చాడు.ఇక బాలయ్యది చిన్న పిల్లాడి మనస్థత్వం అని చాలా మంది ఇండస్ట్రీలో చెబుతుంటాడు. నిజానికి కనిపించడానికి గంభీరంగా ఉన్న బాలయ్య మనసు వెన్న. అన్‌స్టాపబుల్ షోలో అసలు తన తోటి నటులతో ఆయన నడుచుకునే తీరు చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాదు.. అభిమానులకు కష్టం వచ్చిందని తెలిస్తే.. అరక్షణం కూడా ఆలోచించకుండా రియాక్ట్ అవుతుంటాడని చాలా మంది చెబుతుంటారు.
మరింత సమాచారం తెలుసుకోండి: