ఎలక్షన్స్ టైం నుంచి పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు
ఆర్మీ ఫైట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యాన్స్ కూడా అల్లు ఆర్మీని ఎటాక్ చేస్తూ సోషల్ మీడియాలో రగడ పుట్టిస్తున్నారు.ఇదంతా కూడా
ఏపీ ఎలక్షన్ టైం లో
అల్లు అర్జున్ తన ఫ్రెండ్
వైసీపీ తరపున పోటీ చేస్తుంటే అతనికి సపోర్ట్ చేయడమే. ఆ తర్వాత పవన్ కే తన మద్దతు అని చెప్పినా కూడా ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం కన్విన్స్ అవ్వలేదు. ఇక ఈ గొడవకు ఆజ్యం పోసినట్టుగా మనవాడు పరాయివాడు అంటూ మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ చెయ్యడం కూడా మెగా వర్సెస్ అల్లు గొడవపై స్పష్టత వచ్చింది.ఈ వేడి మీద ఆగష్టు నెలలో పుష్ప 2 వస్తే కచ్చితంగా ఆ ఇంపాక్ట్
సినిమా మీద పడేది. ఐతే
సినిమా పూర్తి కాకపోవడం తో పుష్ప 2 మూవీని
డిసెంబర్ కి వాయిదా వేశారు.
ఎలక్షన్స్ జరిగి దాదాపు 2 నెలలు పైనే అవుతున్నా కూడా అల్లు
ఆర్మీ, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గొడవ జరుగుతూనే ఉంది. ఐతే ఈ టైం లో పవన్
కళ్యాణ్ సినిమా తో
అల్లు అర్జున్ సినిమా పోటీకి దిగితే మాత్రం ఊహించడం కూడా కష్టమే అనిపిస్తుంది.
పుష్ప 2 సినిమాని
డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేశారు. ఇక పవన్
కళ్యాణ్ నటిస్తున్న వీరమల్లు సినిమాను కూడా త్వరగా పూర్తి చేసి ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. పవన్
కళ్యాణ్ మరో 20 రోజులు డేట్స్ ఇస్తే
హరి హర వీరమల్లు పూర్తి చేస్తారని సమాచారం తెలుస్తుంది. ఐతే అన్ని అనుకున్నట్టు జరిగితే
డిసెంబర్ నెలలో వీరమల్లు రిలీజ్ ఉంటుందని సమాచారం. ఇక అలా అయితే పుష్ప 2 వచ్చిన టైం లోనే వీరమల్లు రిలీజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగితే ఖచ్చితంగా పెద్ద యుద్ధమే జరుగుతుంది.పుష్ప 2 వర్సెస్ వీరమల్లు ఒకే రోజు కాదు కదా కనీసం వారం రోజులు గ్యాప్ ఉన్నా కూడా ఖచ్చితంగా మెగా వర్సెస్ అల్లు ఫైట్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ఒకరి మీద మరొకరు పై చేయి సాధించాలని ఖచ్చితంగా ప్రయత్నిస్తుంటారు. ఇక సోషల్ మీడియాని ఐతే హోరెత్తించేయడం ఖాయం. పుష్ప 2
సినిమా ఆల్రెడీ ఇప్పుడనుకున్న
డిసెంబర్ 6న రావడం ఖాయం అని తెలుస్తుంది..