కార్తీ సర్దార్ సీక్వెల్ లో ఆ స్టార్ యాక్టర్..?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఆడియెన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూసే ఓ మూవీ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ చిత్రం. తాజాగా సర్దార్ 2 పూజా కార్యక్రమం జరిగింది.జూలై 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనున్నట్లు పేర్కొంది.తాజాగా క్రేజీ వార్తతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కార్తీ టీం. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్జే సూర్యకు స్వాగతం పలుకుతూ ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు మేకర్స్. షూటింగ్ కొనసాగుతుందని తెలియజేశారు. ముందుగా వచ్చిన వార్తల ప్రనకారం చెన్నైలో వేసిన భారీ సెట్లో సర్దార్ 2 షూటింగ్ కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
సర్దార్ 2ను కథానుగుణంగా కజకిస్తాన్, అజర్బైజాన్, జార్జియాలో చిత్రీకరింయబోతున్నట్టు సమాచారం. ఈ మూవీలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని ఇన్సైడ్ టాక్… కాగా ఈ వివరాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.సర్దార్ ఎండింగ్ లో నెక్స్ట్ మిషన్ కంబోడియాలో జరగబోతోందని దర్శకుడు చెప్పారు. అక్కడి నుంచే ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.