పుష్ప 2కి గండాలు తప్పవా?
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. దాంతో ఆగస్టులోనే రిలీజ్ డేటు ప్రకటించింది సదరు నిర్మాణ సంస్థ. అయితే తర్వాత జరిగిన కొన్ని అనూహ్య కారణాల వలన పుష్ప రిలీజ్ డేట్ ఏకంగా డిసెంబర్ కి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. మరి ముఖ్యంగా ఎన్నికల సమయం అప్పుడు అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత క్రమంలోనే సినిమా విడుదల వాయిదా పడటం గమనార్హం.
ఇక వాస్తవం ఎంత ఉందో తెలియదు గానీ.. మెగా వర్సెస్ అల్లువార్ సోషల్ మీడియాలో చాలా గట్టిగా నడుస్తుంది. సొంత మామ రాష్ట్రాభివృద్ధి కోసం ఎండీఏ కూటమిలో చేరితే.. మేనల్లుడు వైసిపి పంచన చేరాడు ఏంటని రకరకాల విమర్శలు వెలువెత్తున సంగతి అందరికీ తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలోనే పుష్ప సినిమా నిర్మాతలు మైత్రి మేకర్స్ వారు సినిమాను వాయిదా వేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే పుష్ప టు విషయంలో మేకర్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారని... సినిమా రిలీజ్ అయిన మెగా గండం తప్పేట్టు లేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. చూడాలి మరి చివరికి ఏమి అవుతుందో..