కల్కి ఓటీటీ రిలీజ్ లో బిగ్ ట్విస్ట్..?
రిలీజ్ డేట్ నుంచి పది వారాల తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుందని స్పష్టమైంది. అంటే సెప్టెంబర్ తొలి లేదా రెండో వారంలోగానీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ఉండనుంది. సాధాిరణంగా ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు నుంచి ఆరు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కానీ కల్కి విషయంలో మాత్రం పది వారాల గ్యాప్ ఉండాలని నిర్ణయించారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా రానున్నట్లు అంచనా వేస్తున్నారు.ఇక కల్కి 2898 ఏడీ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలోకి వస్తుంది. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో రానుండగా.. మిగతా భాషల వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతాయి.ఇదిలా ఉంటే, మహాభారతంలోని కొన్ని అంశాలను స్ఫూర్తిగా తీసుకుని కల్కి 2898 ఏడీ సినిమాను తెరకెక్కించారు నాగ్ అశ్విన్. ఇందులో అశ్వత్థామ పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటన అత్యద్భుతంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య వచ్చిన యాక్షన్ సీక్వెన్స్‌కు మంచి అప్లాజ్ వస్తోంది.