వీక్ డే రోజు "భారతీయుడు 2" కి గట్టి దెబ్బ.. దీనితో సినిమా రిసల్ట్ క్లియర్..?
4 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 5.37 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.53 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.40 కోట్లు , ఈస్ట్ లో 82 లక్షలు , వెస్టు లో 53 లక్షలు , గుంటూరులో 1.04 కోట్లు , కృష్ణ లో 81 లక్షలు , నెల్లూరు లో 43 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.93 కోట్ల షేర్ ... 19.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 13.07 కోట్ల షేర్ కలక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.