నాచురల్ స్టార్
నాని ప్రస్తుతం
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ తర్వాత
నాని ,
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ
మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే
నాని ,
శ్రీకాంత్ కాంబోలో
దసరా అనే
సినిమా రూపొందింది. ఈ
మూవీ పోయిన సంవత్సరం మంచి అంచనాల నడుమ తెలుగు తో పాటు
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో పాన్
ఇండియా మూవీ గా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
ఈ
సినిమా మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడికి
నాని మరో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం
శ్రీకాంత్ ,
నాని సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే
నాని హీరోగా రూపొందబోయే సినిమాలో
హీరోయిన్ గా కూడా ఒక
బ్యూటీ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ దర్శకుడు
నాని హీరోగా రూపొందబోయే సినిమాలో
జాన్వి కపూర్ ను
హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ దర్శకుడు ఈమెకు స్టోరీని వినిపించగా , ఆ కథ బాగా నచ్చడంతో
నాని హీరోగా
శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందుబోయే సినిమాలో
హీరోయిన్ గా నటించడానికి ఈ
బ్యూటీ గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ప్రస్తుతం జాన్వీ ,
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే
రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబోలో రూపొందబోయే సినిమాలో
హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక ఈమెకు
బాలీవుడ్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది. దీనితో
నాని సినిమాలో కనుక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఓకే అయితే నార్త్ లో నానికి ఫుల్ గా క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.