అన్ని పాత్రలు చేసిన ఎన్టీఆర్ ఆ పాత్ర జోలికే పోలేదు..ఎందుకో తెలుసా..?
"నారదుడి పాత్ర పోషించడానికి ఆలోచించాను. అయితే హాస్యంలా కాకుండా భక్తుడిగా, సర్వజ్ఞుడి గా గంభీరంగా ప్రదర్శన చేయొచ్చు. కానీ అందుకు నా రూపం సహకరించదని అనిపించింది. అందుకే సాహసం చేయలేదు. పైగా నారదుడు అంటే ఇలానే ఉండాలి అనేలా ఓ రూపానికి అందరూ అలవాటు పడ్డాం.అందుకే నా శరీరం కాస్త భారీగా ఉంటుందని ఆ ఆలోచనను పక్కన పెట్టాను. అదే రంగారావు గారిని నారదుడి పాత్ర లో ఊహించగలమా? మా పర్సనాలిటీలు సెట్ అవ్వవు. ఇక హనుమంతుడు పాత్ర విషయానికొస్తే అది నా ముఖం కానప్పుడు నాకెందుకా పాత్ర? నటిస్తే మాస్క్‌తో నటించాలి. ఫిజికల్ మూవ్మెంట్స్ కూడా ఎక్కువ ఇవ్వాలి. అది కుదరదు" అని రామారావు చెప్పుకొచ్చారు.కాగా, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో సిల్వర్ స్క్రీన్‌పై ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో అభిమాన నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. సినీ రంగం లో తిరుగులేని ధ్రువతారగా, రాజకీయ రంగం లో అశేష ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు.