షాక్: కార్తీ సర్దార్-2 లో షూటింగ్లో ప్రమాదం.. ఆందోళనల ఫ్యాన్స్..!
అందుకున్న సమాచారం ప్రకారం సర్దార్-2 సినిమా షూటింగ్ సమయంలో కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగినట్టుగా సమాచారం.. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తీస్తూ ఉండగా స్టంట్ మాన్ ఎజుమలై దాదాపుగా 20 అడుగుల పైనుంచి కింద పడి మృతి చెందారు.. దీంతో పాటుగా మరో ఇద్దరి అసిస్టెంట్లు కూడా స్టంట్ మాన్లకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్తీక్ షూటింగ్ స్పాట్లోనే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి స్టంటు మాస్టర్ని తరలించారట.
అయితే ఆసుపత్రికి తరలించే లోక ఏజుమలై మృతి చెందారని వైద్యులు తెలియజేశారు.. అయితే హీరో కార్తీ కి ఏం కాలేదని తెలిసి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.గతంలో భారతీయుడు-2 సినిమా షూటింగ్లో కూడా ఫైట్ మాస్టర్ మృతి చెందడం జరిగింది. సర్దార్ -2 సినిమా సమయంలో కూడా ఇప్పుడు ఇలాంటి ప్రమాద ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. స్టంట్ మాన్ ఎజమాలై మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక తెలుగులో విషయానికి వస్తే.. అప్పుడప్పుడు ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి.