తనకంటే చిన్నవాడితో ప్రేమ అంటున్న నయన్.. ఏంటి పాప ఇది..!
కానీ ఆమె మాత్రం కథ నచ్చితే చిన్న హీరోలా పక్కన కూడా చేయడానికి వెనకాడదు. ఇది నయనతార లోని ఇంకో యాంగిల్ అనొచ్చు. రీసెంట్ గా నయన్ ఓ సినిమా ఒప్పుకుంది. ఈ సినిమాకు హీరో కెవిన్ రాజ్. తమిళ్ బిగ్ బాస్ తో ఇతను లైమ్ లైట్ లోకోచ్చాడు. ఈ సినిమాను నయన్ భర్త విఘ్నేశ్ నిర్మించనున్నాడట. విష్ణు ఇడవన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో నయన్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కథ రీత్యా ఇందులో నయన్ హీరో కంటే వయసులో పెద్ద అట్ట. కానీ..చిన్నవాడైన హీరోను లవ్ చేస్తుండట.
ఈ కథ నచ్చే నయన్ చేయడానికి ఒప్పుకుందని తెలుస్తుంది. ఏదేమైనా తాను హీరోగా నటిస్తున్న సినిమాలో నయనతార వంటి సూపర్ స్టార్ హీరోయిన్ కావటంతో కెవిన్ రాజ్ ఆనందానికి పట్టపగ్గాల్లేవట. ఇకనైనా తార ఏ సినిమాలో నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఆమె నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆమె అందం ఐశ్వర్యంతో అందరిని ఆకట్టుకుంది. డైరెక్టర్ గా ఇప్పుడు విగ్నేష్ శివన్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా చూడాలి. కథ రీత్యా ఇందులో నయన్ హీరో కంటే వయసులో పెద్ద అట్ట.