మొదటి సినిమా విడుదల కాకుండా అనేక సినిమాలలో ఆఫర్లు కొట్టేసిన బ్యూటీస్ వీరే..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు వారు నటించిన మొదటి సినిమా విడుదల కాకుండానే అనేక సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలా తెలుగు సినీ పరిశ్రమలో కూడా కొంతమంది హీరోయిన్ల విషయంలో జరిగింది. అలా మొదటి సినిమా విడుదల కాకుండానే తెలుగులో భారీ అవకాశాలను దక్కించుకున్న బ్యూటీలు ఎవరో తెలుసుకుందాం.
కృతి శెట్టి : ఈ ముద్దుగుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాల ద్వారానే ఈమెకు మంచి గుర్తింపు లభించింది. దానితో ఈమెకు ఉప్పెన సినిమా విడుదల కాకముందే తెలుగు లో అనేక సినిమాలలో అవకాశాలు దక్కాయి.
భాగ్య శ్రీ బోర్స్ : ఈ నటి ప్రస్తుతం రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈమెకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే ఓ మూవీలోనూ , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందబోయే ఓ మూవీలోను ఈమె హీరోయిన్  సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.
జాన్వి కపూర్ : ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా ఒకే అయింది. అలాగే నాని , శ్రీకాంత్ ఓదెలా కాంబోలో రూపొందబోయే సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: