కోలీవుడ్కి ఇక వెయ్యి కోట్లు అందని ద్రాక్షానా?
తెలుగు సినిమాల తరువాత హిందీ, కన్నడ సినిమాలు మాత్రమే ఇండియాలో 1000 కోట్ల సినిమాలని ఇచ్చాయి. తమిళ సినిమాలకు మాత్రం 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఇప్పుడు అందని ద్రాక్షాగా అవుతుంది. జైలర్, విక్రమ్, పొన్నియన్ సెల్వన్ అంత పెద్ద హిట్టైనా కూడా కనీసం యావరేజ్ హిట్ అయిన రోబో 2.0 సినిమా వసూళ్ళని కూడా క్రాస్ చేయలేకపోయాయి. అసలు 400, 500, 600, 700 కోట్ల దగ్గరే ఆగిపోడానికి కారణమేంటి..? అన్ని విషయాల్లో బానే ఉన్నా.. 1000 కోట్ల సినిమాలని ఇవ్వడంలో తమిళ మేకర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.తెలుగు, హిందీ, కన్నడ సినిమాలకు సాధ్యమైన రికార్డ్.. కోలీవుడ్‌కు ఒక్కటే ఎందుకు సాధ్యం కావట్లేదు..? సింగిల్ లాంగ్వేజ్‌లో 400 కోట్లు కొడుతున్న సినిమాలు.. 1000 కోట్లు వసూలు చేయకపోవడానికి కారణమేంటని అంతా ఆలోచిస్తున్నారు. అయితే దీనికి చాలా కారణాలున్నాయి.
నిజం చెప్పాలంటే తెలుగు సినిమాల కంటే ముందే తమిళ సినిమాలు 100 కోట్లు, 200 కోట్లు వసూలు చేసాయి. రాజమౌళి కంటే ముందే శంకర్ అక్కడ శివాజీ, రోబో సినిమాలతో ఎన్నో అద్భుతాలు చేసారు. ఇంత చేసినా కూడా ఇప్పటికీ కోలీవుడ్‌కు 1000 కోట్లు రాలేదు. రోబో 2.0 1000 కోట్లు రాబడుతుంది అనుకున్నారు. కానీ ఆ సినిమా 700 కోట్ల దగ్గరే ఆగిపోయింది.కల్కితో తెలుగు ఇండస్ట్రీ మూడోసారి 1000 కోట్లు రుచి చూస్తే.. దంగల్, పఠాన్, జవాన్‌తో మూడు సార్లు హిందీ.. కేజియఫ్ 2తో ఓసారి కన్నడ ఇండస్ట్రీ 1000 కోట్లు అందుకున్నాయి. ఇంకా మరికొన్ని సినిమాలు కూడా ఈ జాబితాలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.తమిళ సినిమాలను కేవలం అక్కడి ఆడియన్స్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు అక్కడి దర్శకులు. ఈ విమర్శలు చాలా రోజుల నుంచి ఉన్నాయి.. అయితే ఇందులో నిజం లేకపోలేదు. పొన్నియన్ సెల్వన్ 1 అండ్ 2 కలిపి టోటల్ గా 700 కోట్లు వసూలు చేసాయి. ఓన్లీ తమిళ వాళ్లకి నచ్చే విధంగా తియ్యడం వల్లనే కోలీవుడ్ 1000 కోట్లకు దూరంగా ఆగిపోయింది.