బాలయ్య తన కెరీర్ లో మొదటిసారి కెమెరామెన్ గా పని చేసిన సినిమా అదేనా..?
ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రహ్మం గారి పాత్ర పోషించగా అతని భక్తుడు అయిన సిద్ధప్ప పాత్రలో బాలకృష్ణ నటించాడు. సిద్దప్ప ను ఒక రకంగా ఈసినిమాలో కథానాయకుడిగా చూపించే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. ఎన్నో ఇబ్బందులు మధ్య ఈ సినిమా విడుదలై ప్రభంజనం సృష్టించింది. సెన్సార్ బోర్డు వారి అభ్యంతరాల వల్ల పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే.. విడుదలై బారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో బండ్లు కట్టుకుని మరీ దూర ప్రాంతాలకు వెళ్లి జనాలు ఈసినిమాను చూశారు.
సినిమా తీసే విధానం నేర్చుకున్న బాలయ్య.. ఈసినిమాలో కొన్ని షాట్స్ కు స్వయంగా బాలకృష్ణ కెమెరామెన్ గా పని చేసారట. అలా బాలకృష్ణ కెరీర్ లో కెమెరా మెన్ గా పనిచేసిన ఏకైక సినిమాగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర నిలిచిపోయింది. కాని ఈసినిమా తరువాత అది కంటీన్యూ చేయలేకపోయారు.ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్తున్నాడు.ఇక ఏజ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు ధీటుగా బాలయ్య సినిమాలు చేస్తున్నాడు.