అది లేని వాడినని దిగులు పడను.. జగపతిబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల జగపతిబాబు సత్తా చాటుతున్నాడు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో విలన్ గా నటిస్తున్నాడు. ఈ క్రమంలో గుంటూరు కారం మూవీలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. తాజాగా సోషల్ మీడియాలో జగపతిబాబు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అందులో క్యాసినో ఆడుతున్న బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ కలర్ ప్యాంట్, షర్ట్ వేసుకుని ఒక్క బ్యాగ్ ను తగిలించుకుని ఫోటోకి స్టిల్ ఇచ్చాడు.
అలాగే "సిగ్గులేని వాడినని దిగులు పడ్డాను..కానీ మీరు చెబితే పడతాను" అంటూ క్యాప్షన్ జోడించాడు. అది చూసిన నటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారింది. జగపతిబాబు హీరోగా నటించిన సినిమాలు గాయం, రుద్రంగి, శుభలగ్నం, అంతపురం, లక్ష్య, ఈ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. జగపతిబాబు విలన్ క్యారెక్టర్ చేశాక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.