ప్రభాస్ కి గండం తప్పినట్టేనా?
ఇక అసలు విషయంలోకి వెళితే... ప్రభాస్ బాహుబలి తరువాత వచ్చిన రెండు మూడు సినిమాలు సరిగా ఆడకపోవడంతో ఇక ప్రభాస్ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ సాలార్, కల్కి సినిమాలు సూపర్ డూపర్ హిట్లగా నిలవడంతో ఆ గండం తప్పిందని రెబల్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ కి తిరిగే లేదని కూడా చెబుతున్నారు సినిమా ప్రముఖులు. ఇకపోతే ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ ఇండియాలో సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వినికిడి. అంటే వార్ బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీగా మూవీ కథాంశం ఉంటుంది. అదేవిధంగా సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడనే విషయాన్ని సందీప్ ఎప్పుడో చెప్పుకొచ్చాడు.
పోలీస్, సోల్జర్ క్యారెక్టర్స్ ని ప్రేక్షకులు ఎప్పుడు పవర్ ఫుల్ గా చూస్తారు కాబట్టి ప్రభాస్ ఆ పవర్ ని సిల్వర్ స్క్రీన్ పైన చూపించాలంటే ఫిట్ నెస్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా ఒకేసారి చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఏది ఏమైనా వరుస ప్రాజెక్ట్స్ పెట్టుకొని కూడా డార్లింగ్ ప్రభాస్ ఏ మాత్రం అలసట లేకుండా పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ ముందుకు పోతుండడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. కల్కి మూవీ రిలీజ్ ఆలస్యం అవడం వలన ఈ ఏడాదిలో ఒక్క సినిమాని మాత్రమే డార్లింగ్ అందించగలిగాడు. వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలు రిలీజ్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.