మాస్ మహారాజా రవితేజ అలాగే ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. గతంలో ఈ సినిమా సన్సేషనల్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా బ్రహ్మానందం, అజయ్, జ్యోతిక, ప్రకాష్ రాజ్, జయప్రకాశ్ రెడ్డి, శివ నారాయణ, అమిత్ తివారి వంటి నటీనటులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా అభిమానులలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అంతేకాకుండా రవితేజ నటనకు అభిమానులంతా
ఫిదా అయ్యారు. రవితేజ మార్కెట్‌ను, రేంజ్‌ను పెంచిన సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 2006లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఇందులో అత్తిలిసత్తిబాబు అనే దొంగగా, విక్రమ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో పవర్ఫుల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో రవితేజ అదరగొట్టాడు. భారీ బడ్జెట్ సినిమాలను రవితేజతో తెరకెక్కించవచ్చనే నమ్మకాన్ని విక్రమార్కుడితోనే నిర్మాత్లలో బలపడేలా చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమాతోనే స్టార్ హీరోల లీగ్‌లో రవితేజ ప్లేస్ పక్కా
అయిపోయింది. ఇప్పటికీ కూడా అభిమానులు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సినిమా ఇప్పుడు రీరిలీజ్ కి సిద్ధమైంది. ఈ జులై 27న ఈ చిత్రం రీ రిలీజ్ కి ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాని ఫాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా మరోసారి థియేటర్లలో చూడొచ్చు. మరోసారి ఈ బ్లాక్ బస్టర్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అంతా
ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రవితేజ మరియు హరి శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులలో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇందులో అందాల బొమ్మ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తోండగా, మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.