వరలక్ష్మికి జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన భర్త..!?

Anilkumar
నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఆమె నికోలై సచ్ దేవ్ అనే వ్యక్తితో పెళ్లి బంధం లోకి అడుగు పెట్టింది. ఆయనతో కలిసి ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇకపోతే తండ్రి నుండి నటనను వారసత్వంగా తీసుకున్న వరు.. అనతి కాలంలో ఆ ముద్రను చెరిపేసుకుని తనకంటూ సొంత పాథ్ ఏర్పాటు చేసుకుంది. దక్షిణాది ఇండస్ట్రీని మడతపెట్టేస్తుంది. ఈ రంగంలోకి వచ్చి దాదాపు పుష్కర కాలమైనా.. ఆమె క్రేజ్ కానీ, ఆఫర్లు కానీ తగ్గలేదు. వర్సటైల్ యాక్టర్‌గా.. తండ్రికి

 తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. తెలుగులో రావడానికి కాస్త ఆలస్యమైనా.. తన యాక్టింగ్‌తో వరుస ఆఫర్లు కొల్లగొడుతుంది. ఇటీవల ఆమె కొత్త ఫేజ్‌లోకి వెళ్లింది.  ప్రియుడు, వ్యాపారవేత్త, ఆర్టిస్ట్ నికోలయ్ సచ్ దేవ్‌ను వివాహం చేసుకుంది. జులై 3న నికోలాయ్, వరలక్ష్మీ వివాహం ధాయిలాండ్‌లోని క్రాబీలో హిందు, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వివాహతంతు ముగిశాక.. ఇండియాకు తిరిగి చేరుకున్న ఈ జంట.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. దక్షిణాది ఇండస్ట్రీలో ప్రముఖులంతా విచ్చేశారు. అయితే ఆమెకు తన భర్త ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారట. అదేంటంటే.. పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయికి ఇంటిపేరు మారుతుంది. 'నా భార్య కూడా

 అలాగే తన పేరు మార్చుకోవాలనుకుంది. అయితే అందుకు భిన్నంగా నా పేరును వరలక్ష్మి శరత్‌కుమార్‌ని యాడ్‌ చేసుకొని నేనే 'నికోలై వరలక్ష్మి శరత్‌కుమార్‌ సచ్‌దేవ్‌ 'గా మార్చుకుంటున్నాను. రేపు నా పిల్లలకు కూడా వరలక్ష్మి శరత్‌కుమార్‌ అనే పేరు వారసత్వంగా వస్తుంది. ఆమెకు నేనిచ్చే గుర్తుండిపోయే కానుక ఇదే. నా భార్య మంచి నటి మాత్రమే కాదు, మంచి వ్యక్తి కూడా. రోజు తన నుంచి ఓ కొత్త విషయం నేర్చుకుంటా. త్వరలోనే తమిళం కూడా నేర్చుకుంటా. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తుంది' అన్నారు సచ్‌దేవ్‌.  ఆలాగే వరలక్ష్మి మాట్లాడుతూ..'పెళ్లి తర్వాత నటిస్తావా? అని నన్ను చాలా మంది అడిగారు. దానికి నా భర్తే సమాధానం చెప్పారు. నటిస్తుంది అని. 'నికోలై నా ప్రేమ అయితే.. సినిమా నా జీవితం' అని చెప్పుకొచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: