టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు విషయంలో రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా ఇప్పుడు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా చాటింగ్ డేటింగ్ మీటింగ్ లకి సంబంధించిన వివరాలు బయటపడటంతో దొరికిపోయాడు రాజ్ తరుణ్. ఎలా కలిశారు అన్న వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2023లో రాజ్ మాల్వి మల్హోత్రా కి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. రాజ్ తరుణ్ ప్రేమను మాల్వి సైతం అంగీకరించినట్లుగా ఆ చాటింగ్‌లో ఉంది. అనేకసార్లు మాల్వి రాజ్ కోసం హోటల్స్ సైతం
బుక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు ఎటువంటి సంబంధం లేదు అని మాల్వి చెబుతున్నప్పటికీ ఈ చాట్ లీక్ కావడంతో వారిద్దరి మధ్య సంబంధం ఉంది అని రుజువయింది. ప్రేమించి తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను మోసం చేశాడంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మాల్వీ మల్హోత్ర కోసం తనను దూరం పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు హీరోయిన్ మాల్వీ సైతం లావణ్య పై కేసు పెట్టింది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్న తరుణంలో రాజ్ తరుణ్ తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. అబార్షన్ కూడా చేయించాడని.. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది
లావణ్య. ఆ మధ్య ఆత్మహత్య ఆలోచన కూడా చేసింది లావణ్య. మరోవైపు మాల్వి, రాజ్ తరుణ్‌పై లావణ్య కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య పెట్టిన కేసులో రాజ్ తరుణ్‌కి పోలీసులు నోటీసులు కూడా పంపారు. గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. రాజ్ తరుణ్ రాలేదు. షూటింగ్స్, బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని రాజ్ తరుణ్ పోలీసులకు లేఖ రాసి తన లాయర్‌తో పంపించారు. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా రాజ్ తరుణ్ మాల్వి లకి సంబంధించిన ఈ చాటింగ్ బయటపడడంతో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..!!