బేబమ్మని కాస్త పట్టించుకోండయ్యా..?

shami
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో అదరగొట్టింది. ఆ సినిమా చూశాక తెలుగు ఇండస్ట్రీకి మరో స్టార్ హీరోయిన్ దొరికినట్టే అనుకున్నారు. బేబమ్మ పాత్రకు అమ్మడు అంతగా న్యాయం చేసింది. అయితే మొదటి సినిమానే 100 కోట్లు కొట్టడంతో అమ్మడికి భారీ క్రేజ్ రాగా ఆ ఇమేజ్ తో వరుస సినిమాలు చేసింది. అయితే చేసిన సినిమాలు.. నటించిన యాక్టర్స్ అంతా మంచి వారే కానీ కథల సెలక్షన్స్ వల్ల అమ్మడు కెరీర్ లో వెనకపడింది.
దాదాపు ఇప్పటికే 10 కి అటు ఇటుగా సినిమాలు చేసిన కృతి శెట్టి కెరీర్ డైలమాలో పడింది. తెలుగులో రీసెంట్ గా శర్వానంద్ తో మనమే సినిమా చేసింది కృతి శెట్టి. ఈ సినిమాలో ఏకంగా ఒక మదర్ రోల్ చేసి షాక్ ఇచ్చింది. అయితే కృతి మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలంటే గ్లామర్ ని నమ్ముకోవాల్సిందే అని ఫిక్స్ అయ్యింది. అందుకే ఇక మీదట గ్లామర్ రోల్స్ కి సై అనేస్తుంది.
అంతేకాదు ఆ హింట్ ఇచ్చేలా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రెచ్చిపోతుంది అమ్మడు. అంతకుముందు స్లీవ్ లెస్ కూడా వేయని కృతి ఇప్పుడు ఏకంగా భారీ రేంజ్ లో గ్లామర్ షో చూపిస్తుంది. థై షోస్ చేస్తూ తనలో ఈ యాంగిల్ ని గుర్తించాలని మేకర్స్ కి హింట్ ఇస్తుంది. కచ్చితంగా కృతి శెట్టి గ్లామర్ సైడ్ ఓపెన్ అయితే మాత్రం ఆమెకు మళ్లీ వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. కృతి తెలుగులో ఎలాగు పెద్దగా ఆఫర్లు లేవని చిన్నగా కోలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ ప్రస్తుతం రెండు సినిమాలు చేసింది. మలయాళంలో కూడా ఒక సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి. తప్పకుండా బేబమ్మ న్యూ టర్న్ ఆమె కెరీర్ కు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: