వావ్: హీరో మాధవన్ చేసిన సాహసానికి ఫ్యాన్స్ ఫిదా..!

Divya
సినిమాల కోసం తమని తాము మార్చుకొని మరి పాత్రలు చేసిన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆ పాత్రలు చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా నటించినటువంటి హీరోలలో హీరో మాధవన్ కూడా ఒకరు.. ఇటీవలే కాలంలో ఆయన ఎంచుకొనే కథలు పాత్రలు చాలా విభిన్నంగా ఉంటున్నాయి.. ఆయన డైరెక్షన్లో వచ్చిన రాకెట్రి దినంబి ఎఫెక్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సైతం అందుకున్నాయి. ఇందులో వయసు మళ్ళిన నంబి పాత్ర కోసం ఏకంగా పొట్ట కూడా పెంచడం జరిగింది మాధవన్..

అయితే మళ్లీ సినిమా అయిపోయిన తర్వాత ఫిట్నెస్ తో కనపడడానికి తాను చాలా డైట్ను పాటించాను అంటూ తాజాగా ఇటీవలె ఒక ఇంటర్వ్యూలో మాధవన్ పంచుకోవడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.. మాధవన్ బరువు తగ్గడానికి ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ని పాటించాను అంటూ తెలియజేశారు.. ఆహారాన్ని తినేటప్పుడు 45 నుంచి 60 సార్లు నమిలి తినేవాడిని అంటూ తెలియజేశారు. చివరిసారిగా సాయంత్రం 6:45 నిమిషాలకు తన ఆహారాన్ని ముగించే వాడినట్టు వెల్లడించారు.

కేవలం వండిన ఆహారాన్ని మాత్రమే తినేవాడినని పచ్చి ఆహారం ఏది కూడా తినాలనిపించిన కూడా మధ్యాహ్నం 3:00 కంటే ముందుగా తినేవాడినంటూ తెలిపారు. రాత్రి సమయాలలో త్వరగా నిద్రపోవడమే కాదు.. నిద్రలో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేవాడినని. ఉదయం లేవగానే ఎక్కువ సమయం నడవడానికి కేటాయిస్తూ ఉంటాను రాత్రి పడుకొని ముందు 90 నిమిషాల పాటు సెల్, టీవీ వంటివి చూడడం దూరం పెట్టేసాను అంటూ తెలిపారు. ఆహారంలో ఆకుకూరలు కూరగాయలను భాగం చేయడం ద్వారా శరీరంలో మెటబాలిజం ఆరోగ్యవంతంగా పెరుగుతుందని దీనివల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. అలా తన 21 రోజులు డైట్ ని గురించి వెల్లడించారు.

అయితే నంబి పాత్ర కోసం మాధవన్ మారిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా మెచ్చుకోవడం కూడా జరిగింది. ఉపవాసం చేసేది మంచిదే అయిన అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: