రష్మిక కు షాక్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ... ఏకంగా ఆ ఛాన్స్ ఎగరేసికెళ్ళింది..?

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన "ఛలో" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తోనే ఈమెకు అద్భుతమైన విజయం , సూపర్ క్రేజ్ తెలుగులో దక్కాయి. ఆ తర్వాత ఈమెకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా మూవీలు అద్భుతమైన విజయాలు అందుకోవడంతో చాలా తక్కువ కాలంలో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. కొంత కాలం క్రితం రష్మిక "పుష్ప పార్ట్ 1" మూవీ లో హీరోయిన్ గా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈమె పుష్ప పార్ట్ 2 మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ చేతి వరకు వచ్చిన ఒక ఆఫర్ మరో క్రేజీ బ్యూటీ కొట్టేసినట్లు తెలుస్తోంది. నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ మూవీ లో నానికి జోడిగా మొదట ఈ దర్శకుడు రష్మిక ను తీసుకోవాలి అనుకున్నాడట. ఈమెకు కథను కూడా వినిపించగా ... ఈమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాకపోతే ఆ తర్వాత నాని సినిమాలో హీరోయిన్ పాత్రకు రష్మిక కంటే జాన్వి బాగుంటుంది అనే ఉద్దేశానికి మూవీ బృందం రావడంతో ఈమెను పక్కన పెట్టి జాన్వీ నీ సంప్రదించారట. జాన్వి కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ బ్యూటీ తోనే ప్రొసీడ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా రష్మిక ను అనుకున్న ప్లేస్ లో జాన్వి ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: