వర్ష బోల్లమ్మ ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల చూపులను తన వైపుకు తిప్పుకుంది. ఇక ఎన్నో సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తోంది. నిజానికి "చూసీ చూడంగానే" అనే సినిమాతో తెలుగు పరిచయమైంది వర్ష బోల్లమ్మ.
తెలుగులో ఈ బ్యూటీ చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ పాపులారిటీ విపరీతంగా తెచ్చుకుంది. జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పకవిమానం, స్వాతిముత్యం, స్టాండప్ రాహుల్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు వర్ష నటించిన లేటెస్ట్ మూవీ "ఊరు పేరు భైరవకోన". విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాదు.... ఇక ఎంతో అమాయకంగా కనిపించే ఈ బ్యూటీ ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోషూట్లు చేస్తోంది. ఆ ఫోటోలను సోషల్ మీడియా అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉండగా.... తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ దీపికా నారాయన్ భరద్వాజ్ విడాకులకు కారణం ఏంటి.... మీ ఉద్దేశం చెప్పండి అంటూ సోషల్ మీడియాలో అడిగింది. దీనికి చాలామంది రకరకాలుగా సమాధానాలు చెప్పారు. ఇక వర్షం మాత్రం విడాకులకు కారణం పెళ్లి అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. పెళ్లయితేనే విడాకుల సమస్య ఉంటుందని.... పెళ్లి చేసుకోకపోతే విడాకుల సమస్య ఉండదని చెప్పుకొచ్చింది.
ఇక ఈ సమాధానం విన్న తన అభిమానులు వర్షాకు పెళ్లిపై ఇలాంటి ఒపీనియన్ ఉందా. పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా డైవర్స్ తీసుకుంటారా? అందుకే ఈ అమ్మడు తన జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో.....లేదో.... అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం వర్ష పోస్ట్ వైరల్ అవుతుండగా.... అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా పెడుతున్నారు.